NZB: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో మండలాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించగా అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.