సత్యసాయి: హిందూపురంలోని SDGS కళాశాలలో ఈనెల 10వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మేళాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. 15 జాతీయ కంపెనీలు పాల్గొంటాయని, పదవ తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు అర్హులని తెలిపారు. జీతం రూ.15,000 నుంచి 25 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు.