KDP: ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా శాంతియుతంగా జీవించాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు చింతల జుటూరు గ్రామంలో మేలుకొలుపు కళాజాత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామాలలో కక్షలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని అన్నారు. కాగా, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజలందరూ ఐకమత్యంగా ఉంటేనే సాధ్య పడుతుందన్నారు.