KDP: కడపలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ విద్యార్థిని అంకాల శైలజ (Mcom 2022-24 ) తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. రవీంద్రనాథ్ మంగళవారం కళాశాలలో విద్యార్థి ప్రతిభను అభినందించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.