CTR: కాణిపాకం అనుబంధ దేవాలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి గరుడ వాహనంపై స్వామివారిని గ్రామోత్సవం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ వాసు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.