GDWL: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చింతలపేటకు చెందిన రామాంజనేయులు (50) మంగళవారం బంధువుల ఓ బాలుడికి ఈత నేర్పించే క్రమంలో లింగం బావిలోకి దిగగా, లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ డిపార్ట్మంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.