VSP: గాజువాక శివారులో ఏర్పాటు కానున్న అదానీ అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ కోసం బుధవారం నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని సీపీఐ నేతలు స్పష్టం చేశారు. మంగళవారం పెద గంట్యాడలో జరిగిన సీపీఐ సమావేశంలో నేతలు ఈ ప్రకటన చేశారు. సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి ఏ.జె. స్టాలిన్ మాట్లాడారు.