SRD: వాల్మీకి జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంగళవారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. వాల్మీకి రచించిన రామాయణం సత్యం, అహింసను బోధిస్తుందని చెప్పారు. వాల్మీకి మార్గంలో నడవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.