MLG: ఆసియా అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ ట్రస్ట్ బోర్డు 1968లో ఏర్పాటయింది. నాటి MLA సంతోశ్ చక్రవర్తి మూడు పర్యాయాలు ధర్మకర్తల మండలి ఛైర్మన్గా పనిచేశారు. తర్వాత మలహాల్ రావు, కోదండం, బోజరావు, బవర్లాల్ లహటి, కె.గోపాలరావు, ఏ.రామ్మూర్తి, రేగ నరసయ్యలు ఛైర్మన్లుగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అర్రేం లచ్చులు పటేల్ ఛైర్మన్గా ఉన్నారు.