PPM: మహాకవి, మనకు రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి కారణజన్ముడని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్ది కొనియాడారు. మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని పూలమాలను వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులు అర్పించారు.