KMR: జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. పనులను త్వరగా పూర్తి చేసుకుంటున్న లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం ప్రతీవారం బిల్లులు జమ చేస్తోంది. నిర్మాణ దశల ఆధారంగా వీటిని చెల్లిస్తోంది. జిల్లాకు 11,623 గృహాలు మంజూరు అయ్యాయి. వాటిలో 6,200 ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.