GNTR: వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను మంగళవారం గుంటూరు కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.