KMM: మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు మాతృమూర్తి నామ వరలక్ష్మి ఐదవ వర్ధంతి సోమవారం నిర్వహించారు. ముత్తయ్య-వరలక్ష్మి స్మృతివనంను నామ తన సోదరులు నామ సీతయ్య, నామ కృష్ణయ్య, సోదరి కమ్మ ధనమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మానాన్న విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.