ప్రకాశం: పెద్దారవీడు మండలంలోని ఎస్ కొత్తపల్లి గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని అంబులెన్స్ ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.