JN: పాలకుర్తి మండలం ముత్తారం గ్రామంలో బీఆర్ఎస్ నేతలు సోమవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ హాజరై మాట్లాడుతూ.. ఎన్నికలు ఏవైనా పాలకుర్తిలో గులాబీ జెండా ఎగరడం ఖాయం అని వారు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించాలని, ఎర్రబెల్లి దయన్న చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.