NTR: వీరులపాడు గ్రామ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు పెరుమాళ్ళపల్లి మహేష్ ఇటీవల ప్రమాదంలో కాలు గాయమై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పార్టీ నాయకులతో కలిసి వారి నివాసంలో అతనిని పరామర్శించారు. అనంతరం మెడికల్ రిపోర్టులను పరిశీలించి, బాధితునికి తగు ఆరోగ్య సూచనలు చేశారు.