AP: వారం వ్యవధిలోనే CM చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర క్యాబినెట్ మరోసారి భేటీ కానుంది. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించడంతో పాటు పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నెల 3న సమావేశమైన మంత్రివర్గం ఆటో డ్రైవర్లకు రూ.15వేలు, పలు సంస్థలకు భూకేటాయింపులు, అమరావతిలో SPV ఏర్పాటు, అమృత్ పథకం 2.0 పనులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.