సత్యసాయి: గోరంట్ల మండలంలో మహిళా హోంగార్డు ప్రియాంక ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. మహిళా హోంగార్డుకు మద్దతుగా సోమవారం గోరంట్ల పోలీస్ స్టేషన్ ముందర మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ధర్నా నిర్వహించారు. ఉషశ్రీ మాట్లాడుతూ.. మహిళా హోంగార్డును వేధిస్తున్న షఫీ, మైనుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.