KNR: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా, నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని, సైదాపూర్ బీజేపీ మండల అధ్యక్షుడు దెంచనాల శ్రీనివాస్ అన్నారు. సైదాపూర్ మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు గెలుపొందాలన్నారు.