VKB: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని దోమ SI వసంత్ జాదవ్ అన్నారు. ఎన్నికల కోడ్ సమయంలో ఎవరైనా వ్యక్తులు, రాజకీయ పార్టీ, కులం, మతంపై దుష్ప్రచారం, తప్పుడు వార్తలు లేదా ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే చర్యలు తప్పవన్నారు. అదే విధంగా సోషల్ మీడియా, బహిరంగ వేదికల ద్వారా అవమానిస్తే చట్టపరమైన నేరాలుగా పరిగణించబడతాయన్నారు.