BHPL: టేకుమట్ల(M) రామకృష్ణాపూర్ గ్రామంలో ఓ యువతి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. ASI దాట్ల కుమారస్వామి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువతి నిన్న రాత్రి కుట్టుమిషన్ దుకాణం వద్దకు వెళ్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె తండ్రి ఫిర్యాదుతో సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు.