‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ చూసి.. ఊహించని విధంగా ట్రోల్ చేవారు నెటిజన్స్. ఇదేం గ్రాఫిక్స్.. ప్రభాస్‌ను యానిమేటేడ్గా చూపించారని అన్నారు. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆదిపురుష్ ఓ యానిమేటేడ్ సినిమా అని తేల్చేశారు. దాంతో ఆదిపురుష్ సినిమాను ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు దర్శకుడు ఓం రౌత్. ప్రస్తుతం గ్రాఫిక్స్ రీ వర్క్‌తో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి.. సందర్భం వచ్చినప్పుడల్లా ట్రోల్ చేస్తునే ఉన్నారు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి ట్రోలింగే జరుగుతోంది. తాజాగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న.. సూపర్ హీరో సినిమా ‘హనుమాన్’ టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ బాగుందని అంటున్నారు.
అంతేకాదు ఈ టీజర్‌ను ఆదిపురుష టీజర్‌తో పోల్చుతున్నారు. గ్రాఫిక్స్ పరంగా హనుమాన్ టీజర్ చాలా బెటర్ అంటున్నారు. పది, పదిహేను కోట్లతో రూపొందుతున్న హనుమాన్ విజువల్స్ ఇంత బాగున్నప్పుడు.. వందల కోట్లు పెడుతున్న ఆదిపురుష్ గ్రాఫిక్స్ ఇంకెలా ఉండాలని కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు.. ఓం రౌత్ పనితీరుపై అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. మినిమం బడ్జెట్ సినిమాలు అదరహో అనేలా ఉంటే.. ఓం రౌత్ ఎందుకలా చేస్తున్నాడని అంటున్నారు.
దాంతో హనుమాన్ టీజర్ చూసిన తర్వాత.. ఓం రౌత్ ఎలా రియాక్ట్ అయ్యాడనేది ఇంట్రెస్టింగ్ మారింది. ఒకవేళ టీజర్ చూడకపోతే.. అర్జెంట్‌గా చూడమంటున్నారు నెటిజన్స్. మొత్తంగా హనుమాన్ టీజర్ ఆదిపురుష్ పై మరోసారి ట్రోలింగ్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు.