ADB: జ్వరాల బారిన పడకుండా దోమలకు దూరంగా ఉండాలని వైద్యాధికారి కిరణ్ కుమార్ అన్నారు. సోమవారం ఇచ్చోడ మండలంలోని రంజాన్పూర కాలనీలో ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. ఇంటింటా తిరిగి శానిటైజేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి పవార్ రవీందర్, ఉత్తమ్ సింగ్, రాథోడ్ కైలాష్, సుభాష్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.