NLG: హాలియాలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలపై సోమవారం పెద్దవూర మండలం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలవాలని దిశా నిర్దేశం చేశారు.