BHPL: రేగొండ(M)లోని రైతు వేదిక సమావేశ మందిరంలో శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో, NIMSME సహకారంతో నిరుద్యోగ యువతీ యువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ GM సిద్ధార్థ రెడ్డి ఇవాళ తెలిపారు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు, పురుషులు ఆధార్ కార్డుతో హాజరు కావాలని కోరారు.