HYD: లాంగ్ వీకెండ్ తర్వాత నగరవాసులు తిరిగి రావడంతో హైదరాబాద్ మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఎల్బీనగర్, నాగోల్, మియాపూర్, రాయదుర్గం స్టేషన్ల వద్ద నిల్చోవడానికి కూడా ఖాళీ లేని పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా పీక్ అవర్స్ తర్వాత రద్దీ తగ్గుతుంది. కానీ ఈరోజు ఉదయం 11 దాటినా ఇదే పరిస్థితి కొనసాగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.