కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘లోక: చాప్టర్ 1′(కొత్త లోక) బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా ఇది రికార్డు సృష్టించినట్లు పేర్కొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించారు.