NRPT: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నర్వ మండలంలో TRS సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. నేడు సోమవారం ఉ.11 గంటలకు అడ్వకేట్ తిప్పారెడ్డి నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరవుతారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.