NZB: నవీపేట్ ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ వరదతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని న్యాయవాది, రిటైర్డ్ డీఎస్పీ మనోహర్ కోరారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడిల మధ్య ఇటీవల నిర్మించిన రోడ్డు బ్రిడ్జి సాంకేతిక లోపంతోనే సుమారు 80 వేల ఎకరాలలో పంటలు నీట మునిగాయని వివరించారు.