సాగుతున్న పుకార్లు, ప్రచారం వాస్తవమైంది. మంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి పార్టీ అధిష్టానంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) అసంతృప్తిగా ఉన్నారు. మొన్న సీఎం జగన్ (YS Jagan) కార్యక్రమంలో జరిగిన అవమానంతో బాలినేని మనస్తాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే పార్టీ పదవుల నుంచి బాలినేని తప్పుకున్నాడు. పార్టీ కో ఆర్డినేటర్ (Co- Ordinater) పదవికి ఆయన రాజీనామా చేసి సీఎం జగన్ కు భారీ షాకిచ్చారు.
ప్రకాశం జిల్లా (Prakasam District) ఒంగోలు (Ongole) ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకుడు. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొనసాగుతున్నారు. తాజాగా ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. పని ఒత్తిడి.. కో ఆర్డినేటర్ గా ఆ జిల్లాలకు కో ఆర్డినేటర్ గా సమయం కేటాయించకపోవడంతో ఈ రాజీనామా చేసినట్లు అధికారికంగా చెబుతున్నారు. కానీ వాస్తవంగా మాత్రం బాలినేని ఎప్పటి నుంచో పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. మంత్రి (Minister) పదవి నుంచి తొలగించడం.. ఆ తర్వాత పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. సొంత జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేశ్ కు మంత్రి పదవి కట్టబెట్టడం వంటి వాటితో బాలినేని ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉన్నారు. కేవలం నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఈ సమయంలో ఇటీవల సీఎం జగన్ పాల్గొన్న కార్యక్రమంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు (Police) అడ్డుకున్నారు. వేదికపైకి వెళ్లకుండా నిలువరించారు.
ఈ ఘటనతో బాలినేని అనుచరులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సభలో బాలినేని అలిగి వెళ్లిపోతుండగా సీఎం జగన్ వెంటనే రంగంలోకి దిగాడు. బాలినేనిని స్వయంగా పిలుచుకుని బలవంతంగా పక్కన నిలబెట్టుకున్నాడు. బుజ్జగింపు ప్రయత్నాలు చేశారు. కానీ బాలినేని మెత్తబడలేదు. ఘోర అవమానాన్ని దిగమింగుకోలేదు. ఈ నేపథ్యంలో పార్టీ (YSRCP) పదవులకు రాజీనామా చేశారు. త్వరలోనే పార్టీకి కూడా బాలినేని దూరమవుతారని సమాచారం.