MNCL: పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు DEO యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు షెడ్యూల్ సైతం విడుదల చేసి MEOలతో పాటు ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చామన్నారు. తరగతులకు హాజరయ్యేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని, ప్రత్యేక తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.