ప్రశాంత్ కిశోర్…. ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రశాంత్ కిశోర్ ఏ పార్టీకి మద్దతు ఇస్తే…. ఆ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం అందరిలోనూ బలం గా పేరుకుపోయింది. దీంతో… దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రముఖ పార్టీలు ప్రశాంత్ కిశోర్ మద్దతు కోసం వేచి చూస్తున్నారు. అన్ని పార్టీలకు ఆయన ఒక్కడే సలహాలు ఇవ్వలేడు కదా… అందుకే… పలు రాష్ట్రాల్లో ఆయన కాకుండా… ఆయన శిష్యులు.. రంగంలోకి దిగుతున్నారు. అయితే… ఇప్పుడు… ప్రశాంత్ కిశోర్ ఇద్దరు శిష్యులు.. ఏపీలోని రెండు ప్రధాన పార్టీలకు పని చేస్తుండటం ఇక్కడ విశేషం.
వచ్చే ఎన్నికల కోసం వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శిష్యుడు రిషి రాజును నియమించుకున్నది. వైసీపీ గడపగడపకు, సంక్షేమపథకాలు, ఇతర కార్యక్రమాలన్నీ రిషిరాజు నేతృత్వంలోనే జరుగుతున్నాయి.
ఇక ఇదిలా ఉంటే, తెలుగుదేశం పార్టీ కూడా తన పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మరో శిష్యుడు రాబిన్ శర్మను నియమించుకున్నారు. ఈయన సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతున్నది. రాబిన్ శర్మ రూపొందించిన బాదుడే బాదుడు కార్యక్రమం ఏపీలో మంచి పేరు తెచ్చుకున్నది.
కాగా, ఇప్పుడు ఇదేం ఖర్మ రాష్ట్రానికి పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. వైపీపీ ప్రభుత్వం వలన రాష్ట్రానికి జరిగిన నష్టాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. వైసీపీకి, టీడీపీ పార్టీల వ్యూహకర్తలుగా ప్రశాంత్ కిషోర్ శిష్యులే ఉండటంతో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.