NZB: రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. ఆదివారం ఎడపల్లిలో స్థానిక ఎన్నికలపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలపై ఎడపల్లి మండల నాయకులకు దిశా నిర్దేశం చేశారు.