శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం నవమి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి శనివారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం: వృత్తి, ఉద్యోగ, వ్యాపార తదితర మీ మీ రంగాల్లో మంచి జరుగుతుంది. మీ తెలివితేటలతో ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం చూపుతారు. ప్రయాణాలు సంతోషాన్ని కలిగిస్తాయి. కానీ ఇంట్లో కొన్ని సంఘటనలతో కొంత కలత చెందుతారు. గణపతి ఆరాధన చేయాలి.
వృషభం:ఒక శుభవార్త వింటారు. ధర్మ సిద్ధి కలదు. మీకు ఆనందించే సంఘటనలు పలు జరుగుతాయి. చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆత్మీయుల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.
మిథునం: అద్భుత అవకాశాలు లభిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రశాంతమైన మనసుతో ముందుకు వెళ్లాలి. ఒక సంఘటన బాధిస్తుంది. ఆదిత్య హృదయ పారాయణం చేయాలి.
కర్కాటకం:మీ రంగాల్లో సానుకూల ఫలితాలు దక్కుతాయి. ఒక శుభవార్త మిమ్మల్ని మీ ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులతో కొంత జాగ్రత్తగా మసలుకోవాలి. ఆంజనేయస్వామిని ఆరాధన చేయాలి.
సింహం: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో వివాదం ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రయత్న కార్యక్రమాలకు కొంత అవరోధం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుంది. నవగ్రహ స్తోత్రం పారాయణం చేయాలి.
కన్య: పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక విషయం మస్తాపానికి గురి చేస్తుంది. అసత్యానికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఇష్టదైవాన్ని ఆరాధించాలి.
తుల: ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. వృథా ప్రయాణాలు జరుగుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. అనవసర భయాందోళనకలకు గురవుతారు. శని ధ్యానం చేస్తే అవన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు.
వృశ్చికం: ఒక మంచి విషయాన్ని వింటారు. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అధికంగా చేస్తారు. రుణ లాభం పొందుతారు. ఇష్టదైవాన్ని ఆరాధించాలి.
ధనుస్సు: కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వాయిదా పడిన పనుల్లో కదలిక వస్తుంది. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దుబారా ఖర్చులు తగ్గించి పొదుపు పాటించాలి. ముఖ్యమైన విషయాల్లో సంయమనం పాటించాలి. శివనామస్మరణ చేయాలి.
మకరం: శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. ప్రయాణాలతో మేలు జరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటి వారితో ఆనందంగా ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవాలి.
కుంభం: బంధుమిత్రుల గౌరవం పొందుతారు. ధర్మ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు. నిర్లక్ష్యం.. బద్ధకం అనేది వదిలించుకోవాలి. శ్రీరామ నామస్మరణ చేయాలి.
మీనం: కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక మంచి అవకాశం చేజారుతుంది. ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. విరోధాలకు దూరంగా ఉండాలి. ఆత్మస్థైర్యంతో అనుకున్నది సాధిస్తారు. పరమేశ్వరుడిని ఆరాధించాలి.