ఆర్ఆర్ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు లాంగ్ గ్యాప్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయంలో నందమూరి అభిమానులు కాస్త అసహనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొరటాల సినిమా కంటే ముందే.. ఓ యాడ్ కోసం బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న ఎన్టీఆర్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి..
ప్రముఖ కంపెనీలు ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు తెగ ఆరాటపడుతున్నాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆర్ఆర్ఆర్ తర్వాత యాడ్స్‌కు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ కమర్షియల్ బాట పట్టాడు. ఇటీవలె ఎన్టీఆర్ ఓ యాడ్ షూట్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఓ ఫోటో కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది.
తాజాగా ప్రముఖ ఫుడ్ బ్రాండింగ్ సంస్థ ‘లీషియస్’ (Licious) కోసం ఎన్టీఆర్ ఈ యాడ్ చేసినట్టు తెలిసిపోయింది. ముందుగా ‘జరగబోయే సంచనలం ఊహించగలరా’.. అంటూ ప్రకటించిన ఆ సంస్థ.. ఆ తర్వాత ‘బ్లాక్ బస్టర్ ఎంట్రీకి రంగం సిద్దమైందంటూ..’ ఎన్టీఆర్ బ్యాక్ లుక్ రివీల్ చేశారు. దాంతో తారక్ ఫ్యాన్స్ కాస్త ఖుషీ అవుతున్నారు. ఇక కొరటాల శివతో చేయబోతున్న ప్రాజెక్ట్ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటీవలె ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టిన కొరటాల..
రీసెంట్‌గానే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశాడు. దాంతో ఎన్టీఆర్ 30 ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎన్టీఆర్ 30 సంగతేమో గానీ.. దాని కంటే ముందు ఈ కొత్త యాడ్‌లో ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడనేది ఇంట్రెస్టింగ్గా మారింది.