CTR: చిత్తూరు జిల్లా కేంద్రంలోని స్థానిక పాత జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం జరుగుతుందని ఎస్పీ తుషార్ డూడి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10: 30 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తామని తెలిపారు. పోలీసు శాఖ నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న వారు, పోలీసుల నుంచి న్యాయం కావాలనుకునే వారు నేరుగా ఫిర్యాదు రూపంలో తెలియజేయాలన్నారు.