కృష్ణా: ఈ నెల 6వ తేదీన సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయంలో అందజేయవచ్చన్నారు.