కృష్ణా: చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన కుంభా రవితేజ ఇటీవల ఆటో ప్రమాదంలో గాయపడి, మంచానికే పరిమితం కావడంతో అతని వైద్య ఖర్చులకు దాతలు ఆదివారం రూ. 20 వేలను నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ చేతులమీదుగా అందచేశారు. పంచాయతీ ద్వారా సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి రూ. 10వేలు, రావెళ్ల ఫౌండేషన్ ఛైర్మన్ రావెళ్ల ఉదయ్ కుమార్ రూ. 8వేలు, మరొక దాత రూ. రెండు వేలు సమకూర్చారు.