AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ నగర్ సచివాలయం వద్ద పిల్లలకు హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులకు డాన్స్, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, పాటలు పోటీలు నిర్వహించారు. గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ పిల్లా రమా, కమిషనర్ ప్రసాదరాజు పలువురు అధికారులు పాల్గొన్నారు.