NLG: బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను గెలుచుకుని పార్టీ అధినేత KCRకు కానుకగా ఇవ్వాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండలోని కేబీఆర్ క్యాంప్ కార్యాలయంలో కనగల్ మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.