AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 9న అనకాపల్లి జిల్లా భీమబోయినపాలెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటుకు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకోనున్నారు. ఈ నేపథ్యంలో భీమబోయినపాలెంలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను జగన్ సందర్శిస్తారు.