ప్రకాశం: అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కనిగిరి DSP సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు. నకిలీ FIR ఉందని సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని మోసగించడానికి ఫోన్ చేస్తారని తెలిపారు. పోలీస్ అధికారులమని చెప్పి మిమ్మల్ని వీడియో కాల్లో ఉండమని మిమ్మల్ని బలవంతం చేస్తారన్నారు. మిమ్మల్ని బెదిరించి, వేధించి డబ్బు అడుగుతారన్నారు. అలాంటి సమయంలో పోలీసులను సంప్రదించాలి.