ASF: జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. గుండి, గోవింద్ పూర్, చిర్రకుంట, బాబాపూర్, తుంపల్లి, జనకాపూర్ తదితర గ్రామాల్లో వాన కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. వ్యవసాయ పరులకు వెళ్లిన రైతులు కాస్త ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరకు అంతరాయం ఏర్పడింది.