BHPL: మహాదేవపూర్ (M) కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం సర్కిల్ సీసీఎఫ్ (ఫారెస్ట్) బీ.ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ప్రభాకర్ స్వామివారికి అభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు, వేద పండితులు స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించి, ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.