జనగాం: పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వడ్లకొండ తార, ఓయూ జేఏసి నేత ఇప్ప పృథ్వీ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు దేవరుప్పుల మండలం నిర్మాల గ్రామం నుంచి కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.