BDK: పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో ఈ చేరికలు శనివారం జరిగాయి. వారికి రేగా కాంతారావు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.