MHBD: తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామంలో ఎంపీటీసీ క్లస్టర్ సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హాజరై, ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు.