NTR: ముప్పాళ్ళ గ్రామంలో శుక్రవారం నాడు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో అలంకరించిన శ్రీ కనకదుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించే నిమజ్జనోత్సవ యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.