MNCL: లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు మారడంతో ఆశావాహుల సంఖ్య పెరిగింది. పలు మండలాల జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు మారాయి. గతంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు మళ్లీ పోటీ చేయాలనుకున్న రిజర్వేషన్లు వారికి నిరాశను కలిగించాయి.