SKLM: ఎచ్చెర్ల మండలం కుశాల పురం గ్రామంలో ఉన్న శ్రీ దుర్గా దేవి అమ్మవారు దసరా పండగ రోజు రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టినట్లు ఆలయ అర్చకులు కాశీభట్ల మురళి శర్మ తెలిపారు. భవాని మాల ధరించిన భక్తులు విజయవాడ దుర్గా దేవి దర్శనానికి పయనమయ్యారని పేర్కొన్నారు.